హిజ్రాలు తమకు ఇళ్లపట్టాలను ఇవ్వాలని ఎమ్మెల్యే కి, ముఖ్యమంత్రి కి విన్నపం.

AP 39TV 19ఫిబ్రవరి 2021:

బొమ్మనహల్ :బొమ్మనహాళ్ మండలంలో నివాసముండు హిజ్రాల ఆక్రందనలు, హార్మోన్స్ లోపం వల్ల మేము హిజ్రాలుగా మారడం వల్ల మమ్మల్ని ఇంటిలోనుంచి తరిమేయడం వల్ల, సమాజంలో బ్రతకాలంటే సమాజం కూడా మమ్మల్ని వెలివేసింది, మమ్మల్ని ఎవ్వరు దగ్గరకు కూడా రానించుకోరు, ఎందుకంటే మేము అడా కాదు, ఇటు మగ కాదు, అందుకని మమ్మల్ని సమాజంలో అందరు ఎగతాళిగానే చూస్తారు తప్ప, మా పైన సానుభూతి చూపించే వారేలేరు, మేము ఉండటానికి ఇల్లు బాడుగకు అడిగినా మాకు సమాజంలో ఎవ్వరు బాడుగకు కూడా ఇళ్ళు ఇవ్వడంలేదు, మేము ఓటు వేస్తున్నాము, అందరికి ఇచ్చినట్టుగానే మాకు స్పెషల్ కేటగిరి ట్రాంజెండర్స్ కింద ఇళ్లపట్టాలు, (స్థలం )మంజూరు చేయమని చాలా సార్లు, MRO గారికి,అర్జీలను పెట్టుకున్నాం. కానీ మాకు ఇంతవరకు ఎలాంటి స్థలం మంజూరు చేయలేదు, మాకు ఉండేందుకు గూడు అడుగుతున్నాము, తలదాచుకోవడానికి మాకు హిజ్రాలకు ఒకచోట ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, మా హిజ్రాలు ఉండేందుకు ఒక స్థలం ఇవ్వాలని బొమ్మనహాళ్ MRO గారిని,ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారిని, ఎంపీ గారిని, కలెక్టర్ గారిని,ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని మా హిజ్రాలు అందరు వేడుకుంటున్నాము అని బొమ్మనహాళ్ మండల హిజ్రాలకు పెద్దమ్మ (హెడ్ ) గా ఉన్న యల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యనే కణేకల్ లో నివాసముండు హిజ్రాలకు పదకొండు మందికి గ్యాస్ గోడను వెనుక ప్రభుత్వం స్థలం ఇవ్వడం జరిగింది, మాకు అలాగే బొమ్మనహాళ్ లో స్థలం ఇవ్వాలని కోరుతున్నాము అన్నారు . ఇందులో బొమ్మనహాళ్ హిజ్రాలు నాగమ్మ, సుజాత, గంగోత్రి, సుధ, నాగలక్ష్మి, మమత, ముంతాజ్,తిప్పమ్మ, శిల్ప, మధులత, తిప్పమ్మ, హిజ్రాలు అందరు కలసి మొరపెట్టుకున్నారు.

 

 

R.ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇన్చార్జి.

Leave A Reply

Your email address will not be published.