మా హయాంలో రౌడీయిజం లేకుండా పాలించాం..మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి

AP 39 TV 25ఫిబ్రవరి 2021:

ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అధికార పార్టీ నేత అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి వ్యవహరిస్తున్నాడని, పోలీసుల తో టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు.నియోజకవర్గం కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి విచక్షణా జ్ఞానం కోల్పోయి తమ పార్టీ మహిళలను సైతం దుర్బషలాడుతున్నాడని ఎమ్మెల్యే వ్యవహార శైలి వాస్తవాలకు భిన్నంగా ఉందని ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలికే విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య బద్దంగా నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్ళలో మాత్రమే సోదాలు చేయడం ఎంత వరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనంత ప్రణాళికా బద్ధంగా తమ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఘాటుగా స్పందించారు.ఎమ్మెల్యే అనంత నియంతలా వ్యవహరించాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు ఎందుకని వైసీపీ వాళ్లే ఏకగ్రీవాలు చేసుకోవచ్చు నన్నారు. వైసీపీ నేతలు భయపెడితే భయపడే స్థితిలో తాము లేమన్నారు.త్వరలో నియోజకవర్గ మంతా తిరిగి ఎమ్మెల్యే అనంత నిరంకుశ చర్యలను ప్రజాకొర్టులో బహిర్గతం చేస్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.