SSBN డిగ్రీ కళాశాలలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమావేశం

AP 39TV 13 మార్చ్ 2021;

అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బందోబస్తు విధులకు వెళ్తున్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు ‌సత్య ఏసు బాబు IPS  ఆదేశాలతో అనంతపురం డీఎస్పీ జి. వీర రాఘవ రెడ్డి స్థానిక SSBN డిగ్రీ కళాశాలలో ఈరోజు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కౌంటింగ్ భద్రత నేపథ్యంలో బందోబస్తు విధులులో ఏం చేయాలి, ఏం చేయకూడదో దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, పెట్రోలింగ్ బృందాల విధులు, ట్రాఫిక్ డైవర్షన్, టికెటింగ్ విధుల్లో నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఆయా విభాగాల్లో కేటాయించిన సిబ్బందికి అప్పగించారు.

Leave A Reply

Your email address will not be published.