రైతులకు శిక్షణ తరగతులు

రైతులకు శిక్షణ తరగతులు మరియు గ్రామీణ విత్తన ఉత్పత్తి పై అవగాహన నిర్వహించిన వ్యవసాయ అధికారి తిమ్మప్ప

ఏపీ39టీవీ న్యూస్ మార్చి 17

గుడిబండ:- మండలంలోని కొంకల్లు రైతు భరోసా కేంద్రం ఆవరణంలో రైతులకు శిక్షణ తరగతులు మరియు గ్రామీణ విత్తన ఉత్పత్తి పై గుడిబండ వ్యవసాయ అధికారి తిమ్మప్ప నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన రైతులతో మాట్లాడుతూ రైతులు పొలంబడి ప్రాధాన్యత ఉపయోగాలు గురించి వివరించారు మరియు తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి సాధించడం గురించి తెలియజేశారు(క్రాప్ బుకింగ్)రైతు పంట నమోదు చేసుకోవడం వలన రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుందని తెలియజేశారు ప్రభుత్వం వేరుశనగ పంట కొనుగోలు గురించి తెలియజేశారు SVP విత్తనం అయితే 6500/కి NON SVP విత్తనం అయితే 6400 రూపాయలు మరియు రవాణా ఖర్చులు తో సహా ప్రభుత్వం కొనుగోలు చేసి వారి బ్యాంక్ అకౌంట్లో లో వారం రోజుల వ్యవధిలో జమ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులకు టార్పలిన్స్ పంపిణీ చేశారు
ఈ కార్యక్రమానికి కొంకల్లు సర్పంచులు కవిత ఓబన్న ఎస్ రాయపురం సర్పంచ్ రాధమ్మ వైఎస్ఆర్ సీపీ నాయకులు హులిరాజు రైతు భరోసా కేంద్రం అధ్యక్షుడు మహా లింగప్ప ఉప సర్పంచ్ సోమశేఖర్ ర్ మాజీ ఎంపిటిసి రమేష్ ఏ ఈ ఓ అమర్నాథ్ రెడ్డి అగ్రికల్చర్ అసిస్టెంట్ సంధ్యారాణి ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.