నిజాయితీ చిత్తశుద్ధితో పని చేయాలి-ఎమ్మెల్యే అనంత

నిజాయితీ చిత్తశుద్ధితో పని చేయాలి ఆర్ పి లకు సూచించిన అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు.

అనంతపురం

మహిళా సంక్షేమమే లక్ష్యం గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు పేర్కొన్నారు.నగరంలోని మహిళా సంఘాల ఆర్ పి లతో తన నివాసంలో మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు మాట్లాడుతూకుటుంబ వ్యవస్థ లో మహిళ పాత్ర కీలకంమహిళా సంఘాల బలోపేతం కోసమే ఆర్ పి వ్యవస్థ ఏర్పాటు.ఆర్ పి తమ పాత్ర ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి.లోటుపాట్లు లేకుండా విధులు నిర్వర్తించాలి.సమన్వయం తో పనిచేయాలి.మనమంతా ఒక కుటుంబం అనే భావనతో బాధ్యత తో చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలి.సి ఓ లు ఆర్ పి లు కలసి పనిచేయాలి.ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి మెప్మా పరిధిలో నగరంలో 21 పేదలు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. వలస వచ్చిన గ్రామీణులను గుర్తించి కొత్త గ్రూప్ లు ఏర్పాటు చేయాలి. వై ఎస్ ఆర్ చేయూత భీమా పథకం అందరికీ చేరేలా చొరవ చూపాలి. మహిళా సంఘాల కు ప్రత్యేక భవనాలు నిర్మించి ఇస్తాం. మహిళా సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసేందుకు తాత్కాలిక భవనం ఏర్పాటు చేస్తాం.నిజాయితీగా విధులు నిర్వర్తించాలి.రాష్ట్రంలోనే మంచి పేరు గుర్తింపు వచ్చేలా మీ శక్తి సామర్ధ్యాలను ఉపయోగించాలి.పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు విజయవంతం చేసేందుకు మీరు కృషి చేయాలి.నగరంలో పారిశుద్ధ్య మెరుగునకు మీరు భాగస్వామ్యం కావాలి.ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారిని మెప్మా ఆర్ పి లు ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో మెప్మా పి డి రమణా రెడ్డి,కార్పొరేటర్ సైఫుల్గా భేగ్,మహిళా సంఘము నాయకురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు

 

Leave A Reply

Your email address will not be published.