G-L53TNVHN5Y కలిసికట్టుగా అనంతను అభివృద్ధి చేసుకుందాం- ఎమ్మెల్యే అనంత | Praja Shankaravam

కలిసికట్టుగా అనంతను అభివృద్ధి చేసుకుందాం- ఎమ్మెల్యే అనంత

AP 39 TV 26 మార్చ్ 2021:

ఎమ్మెల్యే, ఎంపీ,మేయర్,కార్పొరేటర్ అందరూ కలిసి ప్రజలను భాగస్వామ్యులను చేసుకుని అనంతపురం జిల్లా కేంద్రంను అభివృద్ధి పథంలో నడిపించుకుందాం అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.అనంతపురం కార్పొరేషన్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మైనార్టీ ని మేయర్ ను చేసినందుకు కృతజ్ఞతగా సాయినగర్ లోని మజీద్ ఏ రెహమనియా మసీదు నందు శుక్రవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ని సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం, మైనార్టీలకు పెద్దపీట వేశారని అందులో భాగంగా ఒక్క అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మైనార్టీ లకు 10 సీట్లను కేటాయించడమే కాకుండా తొలిసారిగా మైనార్టీని మేయర్ ను చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు.అనంతపురం అభివృద్ధికై ఇప్పటికే రూ.140 కోట్లు కేటాయించడమే కాకుండా రోడ్లు,డ్రైనేజీ పనులను ముమ్మరంగా సాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.గత పాలకుల ఆధిపత్యం కోసం అనంతపురంను బ్రష్టు పట్టించుకోకుండా అందరం కలిసి గట్టుగా అభివృద్ధి చేసుకుందామన్నారు.ప్రజలు మా పై నమ్మకం ఉంచి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి ఒక్క స్థానం కూడా ఇవ్వకుండా చేసారని,ప్రజల నమ్మకాని నిలబెట్టుకుని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తాం అని స్పష్టం చేశారు. త్వరలోనే నగరానికి భూగర్భ డ్రైనేజీ తీసుకు వచ్చి మురికివాడలు లేని నగరం గా తీర్చిదిద్దుతామని తెలిపారు. మేయర్ మహమ్మద్ వసీం  మాట్లాడుతూ ముందుగా తనను గెలిపించిన ప్రజలకు,తనకు మేయర్ పదవిని కట్టబెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి కి, ఎమ్మెల్యే అనంతకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సహకారంతో అందరం కలిసి నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని అందులో ప్రజలు కూడా భాగస్వాముల అవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్,కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్,బాలాంజినేయులు ,అనిల్ కుమార్ రెడ్డి ,ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.