గాండ్లపెంట మండలం పోలీస్ స్టేషన్ నందు నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జునరెడ్డి మరియు పోలీస్స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్ ను పిలిపించి వారికి చట్ట వ్యతిరేక పనులు మరియు ప్రజా శాంతికి భంగం కలిగించే పనులు చేయకూడదని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది .అదేవిధంగా ఎలక్షన్ లో పోటీ చేసిన అభ్యర్థులు ఎటువంటి గొడవలు ,సమస్యలు తావులేకుండా ప్రతి ఒక్కరూ అభ్యర్థి సామరస్యంగా ప్రచారం చేసుకోవాలని ప్రచారం నందు చట్ట ఉల్లంఘన లాంటి చర్యలు చేపడితే శిక్షార్హులు అవుతారని ప్రచార సమయంలో ఎవరికి ఇబ్బందులకు గురి చేయకుండా అధ్యక్షులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలక్షన్ రోజున కూడా ఎవరు ఓటు వారే వేసుకొని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఓటింగ్ నందు పాల్గొని గుంపులు,గుంపులుగా తిరగారాదని పలు సూచనలు చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమణారెడ్డి ,శ్రీనివాసులు ,రామయ్య, రవికుమార్ ,నాగమణి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు