రాష్ట్రంలో తొలిసారిగా అనంతపురం జిల్లా వేదికగా ఎలక్ట్రానిక్ మీడియా స్ట్రింగర్స్ యూనియన్

రాష్ట్రంలో తొలిసారిగా అనంతపురం జిల్లా వేదికగా ఎలక్ట్రానిక్ మీడియా స్ట్రింగర్స్ యూనియన్ ఏర్పాటు

ఏపీ స్ట్రింగర్స్ యూనియన్ (ఏపీ.ఎస్.యూ) గా నామకరణం

ఏపీ.ఎస్.యూ లోగోను ఆవిష్కరించిన అనంతపురం డిఎస్పీ వీర రాఘవరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ మీడియా శాటిలైట్ ఛానళ్ల స్ట్రింగర్స్ అనంతపురం వేదికగా ఏర్పాటైంది. జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్ట్రింగర్స్ యూనియన్ కు ఏపి.ఎస్.యూ గా యూనియన్ సభ్యులు నామకరణం చేశారు. ఏపీ.ఎస్.యూ నూతన లోగో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అనంతపురం డీఎస్పీ వీరరాఘవ రెడ్డి చేతుల మీదుగా లోగును ఆవిష్కరించారు. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా డిఎస్పీ వీర రాఘవ రెడ్డి కొనియాడారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి వారి హక్కులు సాధించుకోవాలని సూచించారు. ఉగాది ఉత్తమ సేవా అవార్డుకు ఎంపికైన డీఎస్పీని యూనియన్ సభ్యులు సన్మానించారు. డిఎస్పి ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు రవీంద్రనాథ్, అధ్యక్షుడు కుమారస్వామినాయుడు, ప్రధాన కార్యదర్శి పవన్,ఉపాధ్యక్షుడు రాజా రెడ్డి,జాయింట్ సెక్రటరీ వేణు, కోశాధికారి సుజేంద్ర, రాజేష్ రమేష్ , సురేంద్ర, చాంద్, దాదాపీర్, మురళి తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.