దళిత యువకుని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి – GVSS జిల్లా అధ్యక్షులు ధనుంజయ్ నాయక్ డిమాండ్

AP 39TV 22 ఏప్రిల్ 2021:

అనంతపురం పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో నివాసం ఉంటున్న దళిత కులానికి చెందిన అంకె సూర్య ప్రకాష్ అనే యువకుని అదే ప్రాంతంలో నివాసం కొనసాగిస్తున్న అగ్రకులాలకు చెందిన వారు తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని నెపంతో మూడు రోజుల క్రితం తన ఇంటికి రప్పించుకొని నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు చేతులు కట్టేసి కిరాతి కిరాతకంగా, విచక్షణ రహితంగా దాడి చేసిన అగ్రకులాల వారిపై తక్షణం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు హత్య కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని అలాగే వారి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించి ఆదుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.