పరిమితికి మించి వసూలు చేస్తే చర్యలు: ఏపీ డీజీపీ

AP 39TV 30 ఏప్రిల్ 2021:

అమరావతి: రాష్ట్రంలో రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్, ఫీజుల పేరిట దోపిడీ తదితర అంశాలపై నిరంతర నిఘా ఉంచినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డ్రగ్ కంట్రోల్, మెడికల్ అండ్ హెల్త్ శాఖల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రుల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలెండర్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100, 1902కు ఫోన్ చేయాలని సూచించారు. కరోనా బాధితుల నుంచి ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజులపై ఆరా తీస్తున్నామని, పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.ఆక్సిజన్ వాహనాలకు రవాణా ఇబ్బందులు కలగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేందుకు కొవిడ్ కంట్రోల్ రూమ్‌లో ఇద్దరు ఐపీఎస్ అధికారులను నియమించినట్లు చెప్పారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రజలకు సూచించారు. మాస్క్ ధరించక పోతే జరిమానా విధిస్తామన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.