G-L53TNVHN5Y ఆర్‌.డి.టి సంస్థ ద్వారా ఆక్షిజన్ అందించు కార్యక్రమం | Praja Shankaravam

ఆర్‌.డి.టి సంస్థ ద్వారా ఆక్షిజన్ అందించు కార్యక్రమం

AP 39TV 03మే 2021:

ఆర్‌.డి.టి ద్వారా స్పందించు ఆక్షిజన్ అందించు కార్యక్రమం
అనంతపురం జిల్లాలోని ఆర్‌.డి.టి సంస్థ ద్వారా స్పందించు ఆక్షిజన్ అందించు కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మరియు రాయలసీమ జిల్లాల్లో నిర్వహిస్తున్నామని ఆర్డీటి ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ తెలియజేశారు. ఆర్ డి టి సంస్థ చేస్తున్న సేవలకు పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అందులో భాగంగానే సహాయ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ అధ్యక్షుడు గడ్డం ముత్యాలప్ప తన వంతు సహాయంగా 5,000 వేలురూ.లు చెక్కును రాప్తాడు మండల కేంద్రంలోని ఆర్ డి టీ కార్యాలయం నందు ఏ టి ఎల్ వర కుమార్ కు అందజేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ప్రజల ప్రాణాలు తీస్తోందన్నారు మన దేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సరైన వైద్యం అందకపోవడంతో ప్రజలు మరణిస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరూ స్పందించు ఆక్షిజన్ అందించు సేవాకార్యక్రమానికి సహాయం చేయాలన్నారు. కరోనా బారిన పడిన వారిని కాపాడేందుకు మనమంతా భాగస్వాములై సహాయ సహకారాలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో మందల పక్కీరప్ప తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.