కరోనా వేళ పారిశుధ్యం పై నిర్లక్ష్యం వద్దు.

AP 39TV 08 మే 2021:

కరోనా విజృంభన రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పారిశుధ్యం పై నిర్లక్ష్యం వద్దని నగర మేయర్ వసీం సూచించారు. శనివారం పారిశుధ్యం పై తన ఛాంబర్ లో అధికారులతో మేయర్ వసీం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం మెరుగునకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.ఎప్పటికప్పుడు డంపర్ బిన్ శుభ్రం చేయాలని సూచించారు. డివిజన్ లలో కార్పొరేటర్ లను సమన్వయం చేసుకుంటూ కాలువలు శుభ్రత రోడ్లు ఊడ్చడం పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్లీచింగ్,స్ప్రేయింగ్ వంటి వాటిని మరింతగా చేపట్టాలని ఆదేశించారు. పారిశుధ్యం మెరుగునకు సచివాలయ సిబ్బంది, వాలింటిర్లను మరింతగా భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ  కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రమణా రెడ్డి,డి.ఈ. రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.