G-L53TNVHN5Y రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఐసోలేషన్ కేంద్రాలు | Praja Shankaravam

రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఐసోలేషన్ కేంద్రాలు

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కదిరి కుమ్మర వాండ్ల పల్లి మార్కెట్ యార్డ్ నందు కరోనా బాధితుల కోసం నిర్వహిస్తున్న యోగివేమన ఐసోలేషన్ సెంటర్ కు అన్ని విధాలా సహాయ సహకారం అందిస్తానని అభిజ్ఞ ఫౌండేషన్ అధినేత పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఐసోలేషన్ సెంటర్ ను సందర్శించిన అనంతరం 60 వేల రూపాయల విలువ గల మందులు, 30 వేల రూపాయల విలువ గల రెండు ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. అలాగే కర్నూలు మెడికల్ కాలేజీ 1997 బ్యాచ్ తరుపున డాక్టర్ మదన్ కుమార్ పిపిఈ కిట్లు, బ్లౌజులు, హెడ్ క్యాప్ లు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనా పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఐసోలేషన్ కేంద్రాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మానవీయ దృక్పథంతో ఈ సెంటర్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మదన్ కుమార్, షణ్ముఖ ప్రియారెడ్డి, షేక్. సాదియా లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో యోగి వేమన కోవిడ్ కేర్ సెంటర్ నిర్వాహకులు బడా సుబ్బిరెడ్డి, జి.ఎల్.నరసింహులు ఎస్ఎఫ్ఐ నాయకులు బాబ్జాన్, సిఐటియు నాయకులు జగన్మోహన్, రామ్మోహన్, ఫాజిల్, జిలాన్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.