ఆర్మూర్, మార్చి 25 (ప్రజా శంఖారావం): ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నిజాంబాద్ వారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు శనివారం పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక ఆయుష్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసి, ఆయుష్ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ డి.ఎస్ రమణమోహన్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి తగ్గించి ఉత్సాహంగా పరీక్షలు పాల్గొనడానికి ప్రత్యేక ఆయుష్ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. పోషకాహార లడ్డూలతో పాటు ఆయూష్ వైద్యవిధానాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిని గంగామణి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యా ఉపాధ్యాయులు స్రవంతి, నవనీత పురుషోత్తం, స్వరూప రాణి, పాల్ రాజు, సుచరిత, మహేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.