ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షం

ఆర్మూర్ టౌన్, మార్చి25 (ప్రజా శంఖారావం): ఆర్మూర్ పట్టణం పెర్కిట్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శనివారం పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ భార్గవి మాట్లాడుతూ మార్చి 20 నుండి ఏప్రిల్ 3 వరకు పోషణ పక్షం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. కిషోర బాలికలకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించడం, వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించారు. చిరుధాన్యాలను ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకోవాలన్నారు. ప్రకృతిలో లభించే తాజా ఆకుకూరలు, పండ్లు, తీసుకోవాలని సూచించారు. మంచి ఆహారం తీసుకోవడం వలన పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉంటారని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ జ్యోతి, సూపర్వైజర్ ఏ శ్రీదేవి, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, టీఎన్జీవో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఏ తార, పెర్కిట్ అంగన్వాడీ టీచర్స్ సునంద, చిత్ర, సరిత, స్వర్ణలత, వహీదా, లింగమని, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.