హైదరాబాద్ బ్యూరో, మార్చి 26 (ప్రజా శంఖారావం): చెన్నైలోని తేని జిల్లాలో కుంభకరై జలపాతం ఒక్కసారిగా వరదలతో ఉదృతంగా ప్రవహిస్తుండడంతో జలపాతాన్ని వీక్షించడానికి వచ్చిన పర్యాటకులు వరదలో చిక్కుకున్నారు. 30 మంది పర్యాటకులను రెస్క్యూటీమ్ రక్షించగా, మరి కొంత మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో రెస్క్యూటీమ్ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతుంది.