అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం

* శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు

* శ్రీరాముల వారి ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే రజితజీవన్ రెడ్డి దంపతులు
* కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు
* గుట్ట పైకి భారతదేశ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం
* ఎస్ హెచ్ ఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు

ఆర్మూర్, మార్చి 30 (ప్రజా శంఖారావం): ఆర్మూర్ పట్టణం నవనాథ సిద్దుల గుట్టపై అంగరంగ వైభవంగా వేదమంత్రోచ్ఛారణ నడుమ, మామిడి తోరణాలతో అలంకరించిన పచ్చని పందిట్లో గురువారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణ వైభోగం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులకు ఆలయ కమిటీ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గుట్టపై ఉన్న శివాలయం, అయ్యప్ప మందిరాల్లో పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్థుల ఉత్సవ విగ్రహాలను సన్నాయి మేళాలతో కొనెట్లోకి ఊరేగింపుగా తీసుకువెళ్లి పంచామృతాలతో స్నానం చేయించి, పట్టు వస్త్రాలతో అలంకరించి, కళ్యాణ మండపంలో వేద పండితులు గోపి శర్మ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా వివాహోత్సవ వేడుకలను జరిపించారు. ఈ సందర్భంగా యజ్ఞ హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేదారేశ్వర ఆశ్రమ మంగి రాములు మహారాజ్, పిట్లం ఆశ్రమ శివకృష్ణ మహారాజ్, నవనాథ సిద్దుల గుట్ట ఆశ్రమం నందీశ్వర మహారాజ్, పిప్రి ఆశ్రమం పరమేశ్వరి మాత లు శ్రీ సీతారాములకు తలంబ్రాలు సమర్పించి యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పట్టు శాలువా పూలమాలతో సన్మానించారు. కల్యాణోత్సవానికి వచ్చే భక్తుల కోసం గుట్టపై ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో భక్తులు శ్రీవారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి గుట్టపై భారీ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవం అనంతరం కల్యాణ వేడుకలకు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, సర్వ సమాజ అధ్యక్షులు ఆకుల రాజు, ఆలయ కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్, పిసీ గంగారెడ్డి, బొబిడే కిషన్, మీనా చందు, నక్కల లక్ష్మణ్, కొడిగెల మల్లయ్య, చిన్నారెడ్డి, అయ్యప్ప శ్రీనివాస్, భారత్ గ్యాస్ ఆనంద్, నరేందర్, అఖిల్, సిద్దుల గుట్ట సేవా భక్తులు, భజన మండలి భక్తులు, బిఆర్ఎస్ నాయకులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

*గుట్ట పైకి ఆర్టీసీ బస్సుల సౌకర్యం*

నవనాథ సిద్దలగుట్టపై శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్ ఆర్టిసి ప్రత్యేక బస్సులను భారత్ గ్యాస్ వారి ఆధ్వర్యంలో ఉచిత సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యంతో కొత్త బస్టాండ్ నుండి గుట్ట పైకి భక్తులు ఉచితంగా ప్రయాణం చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సురేష్ బాబు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి విధులను నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.