G-L53TNVHN5Y ఆకతాయిల బొమ్మ తిరగేసిన పోలీసులు | Praja Shankaravam

ఆకతాయిల బొమ్మ తిరగేసిన పోలీసులు

* బొమ్మ బొరుసు ఆట ఆడుతున్న 10 మంది అరెస్ట్

*14వేలు, 9 బైకులు, 7 ఫోన్లు స్వాధీనం

* అసాంఘిక పనులకు పాల్పడితే చర్యలు తప్పవు…పోలీసుల హెచ్చరిక

రాజంపేట ఏప్రిల్ 09 (ప్రజా శంఖారావం):

బొమ్మ బొరుసు ఆట ఆడుతున్న ఆకతాయిల బొమ్మను రాజంపేట పోలీసులు తిరిగేశారు. వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి 10 మంది ఆకతాయిలు రాజంపేట మండలం తలమడ్ల గ్రామ శివారులో బొమ్మ బొరుసు ఆడుతుండగా పక్క సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఆ రహస్య స్థావరంపై తమ సిబ్బందితో దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 14,620 రూపాయలు, 9 బైకులు 7 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. అసాంఘిక పనులకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.