రసాయన శాస్త్రంలో నాగేశ్వరరావుకు డాక్టరేట్ ప్రధానం

కామారెడ్డి, మే 6 (ప్రజా శంఖారావం): తెలంగాణ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు కు రసాయన శాస్త్రంలో డాక్టరేట్ ప్రధానం చేశారు. కెమిస్ట్రీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ నాగరాజు ఆధ్వర్యంలో సింథసిస్ ఆఫ్ నాచురల్ ప్లావోన్స్, ఐసోప్లావోన్స్, అనాలాగ్సే ఆఫ్ బయోలాజికల్ పోటెన్షియల్ మాలిక్యుల్స్ అనే అంశం పై నాగేశ్వరరావు థీసిస్ ను (సిద్ధాంత గ్రంథం) సమర్పించారు. ఇందుకు గాను ఆయనకు డాక్టరేట్ దక్కింది. వైవా నిర్వహణలో బాహ్య పరిశీలకుడుగా, కాకతీయ విశ్వవిద్యాలయంకు చెందిన సీనియర్ విశ్రాంత ఆచార్యులు సంజీవ రెడ్డి, హాజరై వివిధ ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబట్టి డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఈ (సిద్ధాంత గ్రంథం) ద్వారా ఫార్మసిటికల్ రంగంలో అనగా యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ ఔషధాలు తయారీకి ఈ పరిశోధన గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆధ్యాపకులు డీన్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఆరతి, హెడ్ అప్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ ఎ నాగరాజు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్ డాక్టర్ బాలకిషన్, డాక్టర్ సాయిలు, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ గంగా కిషన్, డాక్టర్ డానియల్, డాక్టర్ రాంబాబు, డాక్టర్ సురేష్ ఇతర అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.