*ఆర్మూర్ లో చైన్ స్నాచింగ్ కలకలం*

* మహిళల మెడలోంచి మూడు తులాల గొలుసు అపహరణ

ఆర్మూర్ టౌన్, మే 25 (ప్రజా శంఖారావం): ఆర్మూర్ పట్టణం మామిడి పల్లిలో మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు అపహరించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే స్కూటీపై తల్లి కూతురు ఇంటి వైపు వెళ్తుండగా వారి వెనుక నుండి బైక్ పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు తన మెడలో నుంచి బంగారు గొలుసును అపహరించినట్లు బాధితురాలు వివరించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్కూటీ పై తాము వెళ్తుతుండగా వెనకాల బైక్ పై వస్తున్న వారు హారన్ కొట్టడంతో తాము పక్కకు జరిగామని, వారు వెళ్లిపోతారని అనుకునే సమయంలోనే తన మెడల నుంచి గొలుసును లాక్కొని దుండగులు పారిపోయినట్లు బాధితురాలు వాపోయింది. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.