డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

ఆర్మూర్ టౌన్, జూన్ 18 (ప్రజా శంఖారావం): ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని షెడ్యూల్ కులాల మహిళ వసతి గృహంలో విద్యార్థిని గోలి వర్షిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణ కేంద్రంలోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతురాలు మెండోరా మండల కేంద్రానికి చెందిన మహిళగా గుర్తింపు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.