G-L53TNVHN5Y పరారీలో బట్టల వ్యాపారి… బడా నేతలకు కుచ్చుటోపి… | Praja Shankaravam

పరారీలో బట్టల వ్యాపారి… బడా నేతలకు కుచ్చుటోపి…

* గత నెల రోజులుగా మూసి ఉన్న వ్యాపారి సముదాయాలు

* మూడు చోట్ల సదురు వ్యాపారికి రెడీమేడ్ బట్టల షాపులు
* పట్టణ కేంద్రంలో రెండు భవంతులతో పాటు మూడు గృహ నిర్మాణ ప్లాట్లు ఉన్నట్లు సమాచారం
* వ్యాపారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయని బాధితులు
* వ్యాపారి వేసిన కుచ్చుటోపి లెక్కలోకి రాని డబ్బేనా ?
* సుమారు 10 కోట్ల మేర కుచ్చుటోపి పడ్డ బయటకు రాని బడా ఫైనాన్స్ బాబులు !

ఆర్మూర్ టౌన్, జూన్ 30 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గత నెల రోజులుగా బట్టల వ్యాపారి తన రెడీమేడ్ బట్టల దుకాణాలను మూసి ఉంచి పరారీలో ఉన్నట్లు సమాచారం. స్వస్థలం రాజస్థాన్ అయినా వ్యాపారి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే స్థిర పడ్డట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారికి పట్టణ కేంద్రంలో రెండు గృహ నిర్మాణాలతో పాటు గృహ నిర్మాణ ప్లాట్లు మూడు చోట్ల ఉన్నట్లు తెలిసింది. సుమారు 10 కోట్ల మేర ఫైనాన్స్ బాబులకు కుచ్చుటోపి పడ్డట్లు వినికిడి. పట్టణంలోని ప్రధాన సెంటర్లలో మూడు చోట్ల వ్యాపారాలు ఉన్న, తాను నిర్వహిస్తున్న బట్టల వ్యాపారంలో పెద్ద మొత్తంలోనే నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక గత నెల రోజులుగా సదరు వ్యాపారికి ఉన్న మూడు రెడీమేడ్ బట్టల షాపులను మూసించినట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు సదరు వ్యాపారి పై బాధితులు ఎవరు కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఒకవేళ ఆ బడా నేతలు సదరు వ్యాపారికి ఇచ్చిన డబ్బు లెక్కలోకి చూపని డబ్బుగా కొందరు గుసగుసలాడుతున్నారు. అనధికారికంగా ఫైనాన్స్, చిట్టీలు నడుపుతున్న కొందరు నేతలే సదరు వ్యాపారికి అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు లెక్కల్లో చూపని డబ్బులు కాబట్టి బాధితులు బయటకు రావడం లేదన్నది నిజం. అనాధికారికంగా లెక్కలు చూపించని డబ్బు కాబట్టే సదరు బాధితునిపై ఫిర్యాదు చేయనట్లు ఉన్నారు. చేస్తే తమకి ఎక్కడ ఇన్కమ్ టాక్స్ ఇబ్బందులు తలెత్తుతాయో అన్న భయంతో బాధితులు ముందుకు రావడం లేదన్నది నగ్న సత్యం. ఏది ఏమైనా ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారి కుచ్చుటోపి పెట్టి పారిపోవడంతో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ నుండి పట్టణ కేంద్రంలో చాలామంది వివిధ వ్యాపార రంగాల్లో చాలా సంవత్సరాలుగా ఇక్కడే స్థిరపడి ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఇలాంటి దాఖలాలు ఎప్పుడు ఎదురుపడలేదని కొందరి వాదన. ఒకరిద్దరు చేసిన తప్పుల మూలన అందరికీ చెడ్డపేరు వస్తుందని మరికొందరు అంటున్నారు. వేచి చూడాలి బాధితులు ఎవరు ముందుకు వస్తారో? అనధికారిక ఫైనాన్స్ చిట్టా రహస్యాలు బయటపడతాయో లేదో ? చూడాలి మరి.

Leave A Reply

Your email address will not be published.