G-L53TNVHN5Y అక్క చెల్లెల జంట హత్యల కలకలం | Praja Shankaravam

అక్క చెల్లెల జంట హత్యల కలకలం

* సంఘటన స్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ ఇంచార్జ్ సిపి ప్రవీణ్

* డాగ్ స్క్వాడ్ బృందంతో నిందితుల కోసం గాలింపు
* మృతుల వద్ద ఉన్న బంగారం కోసమే హత్య చేశారని స్థానికులు అనుమానం ?
* జంట హత్యలు చేసిన నిందితుడు ఇంటికి ఇప్పటినుంచి నా వైనం !
* రాజవ్వ, గంగవ్వ హత్యలతో వారి కుటుంబంలో విషాదం !
* స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలంలో దర్యాప్తు !
* జంట హత్యలతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు …

ఆర్మూర్ క్రైమ్, జూలై 19 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జిరాయాత్ నగర్ లో నివసిస్తున్న ఇద్దరు అక్కచెల్లెలను రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్య చేసి, ఇంటికి నిప్పంటించిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. ఇద్దరు అక్క చెల్లెలు మగ్గిడి గంగవ్వ (62), మగ్గిడి రాజవ్వ (72) లను అర్ధరాత్రి వారు నివసిస్తున్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు హత్య చేసి, ఇంటికి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన ప్రకారం గత 20 సంవత్సరాలుగా ఇద్దరు అక్క చెల్లెలు ఒంటరిగా నివసిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం మల్లన్న గుట్ట వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పండుగలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం సాయంత్రం గంగవ్వ ను ఆమె చిన్న కుమారుడు మహిపాల్ ముదురులోని కంటి ఆసుపత్రిలో కంటి పరీక్ష చేయించి అనంతరం సాయంత్రం వారిద్దరిని మామిడి పల్లి నుండి జిరాయాత్ నగర్ లోని మృతులు ఉంటున్న ఇంట్లో దిగపెట్టి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం వేకువజామున ఇంట్లో నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కిటికీలు బద్దలు కొట్టి మంటలు ఆర్పే క్రమంలో మృతులు ఇద్దరు కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం డాగ్బ్స్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించారు. వృద్ధ మహిళల వద్ద ఒంటినిండా సుమారు 15 నుండి 20 వరకు బంగారం ఉంటుందని స్థానికులు చెప్పారు. నగలు, బంగారం కోసం దుండగులు ఎవరైనా వీరిని హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సి సి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ ప్రవీణ్ కుమార్ తోపాటు ఆర్మూర్ సురేష్ బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.