* ఎంపీ చొరవతో అదిలాబాద్ టు హైదరాబాద్ రైల్వే లైన్ మంజూరు
* సర్వే కోసం 791 లక్షలు మంజూరు చేసిన కేంద్రం
ఆదిలాబాద్ జిల్లా, ఆగస్టు 07 (ప్రజా శంఖారావం): ఎన్నో ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజల కల ఎంపీ సోయం బాపూరావు చొరవతో సాకారం కాబోతుంది. అదిలాబాద్ నుంచి హైదరాబాద్ వయా ఆర్మూర్ మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు సోమవారం ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ మేరకు ఆర్మూర్ నుండి సర్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వం 791 లక్షల నిధులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్ ను కలిసి ఉత్తర్వులను అందుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆయనతోపాటు దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు జీవీ రమణ తదితరులు ఉన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో 17 కోట్ల రూపాయలతో అదిలాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మరో రెండు రోజుల్లో తీపి కబురు చెబుతాను అన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.