ఆర్మూర్ టౌన్, ఆగస్టు 08 (ప్రజా శంఖారావం): ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలో మహారాష్ట్ర గ్రామం కిన్వర్ట్ మండలం సిందగీ గ్రామానికి చెందిన వలస కూలలీ సంతోష్ కీమా(38) ప్రమాదవశాత్తు సోమవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు, ఉన్నట్లు చెప్పారు. గత కొంతకాలంగా పట్టణ కేంద్రంలోని మేస్త్రి వద్ద కూలీ పని చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంటి డాబా పైకి వెళ్లి పడుకున్నాడని, అర్ధరాత్రి ప్రమాదవశాత్తు నిద్రలో కింద జారి పడిపోయినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.