కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుని నియామకం

చేగుంట, ఆగస్టు 08 (ప్రజా శంఖారావం): మెదక్ జిల్లా చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా స్టాలిన్ నర్సింలును పార్టీ రెండవసారి ఎంపిక చేసింది. ఈ నియామకాన్ని దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఎస్సీ సెల్ అధ్యక్షునికి నియామక పత్రాన్ని ఆయన అందజేశారు. స్టాలిన్ మాట్లాడుతూ తన నియామకానికి కృషిచేసిన ఎస్సీ జిల్లా సెల్ అధ్యక్షులతో పాటు నియోజకవర్గ ఇన్చార్జికి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని పార్టీ పటిష్టత కొరకు పని చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దళిత అధ్యక్షులు నాగరి గారి ప్రీతం, పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.