నిజామాబాద్ జిల్లా, సెప్టెంబర్ 01 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గా వి. సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన జాయింట్ పోలీస్ కమిషనర్ గా రాచకొండ పరిధిలో విధులు నిర్వహించి నిజామాబాద్ సిపిగా బదిలీపై వచ్చారు. ఈయన 2006 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. గతంలో పోలీసు కమిషనర్ గా విధులు నిర్వహించిన కే నాగరాజు పదవి విరమణ పొందిన తర్వాత నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ కమిషనర్ గా విధులు నిర్వహించారు.