ఆర్మూర్ టౌన్, సెప్టెంబర్ 05 (ప్రజా శంఖారావం):
ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు సాంస్కృతిక వేషాధారణలో ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణునికి సంబంధించిన ఆయన బాల్యంలో చేసిన చిలిపి పనులను వివరించారు. చిన్నారులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ వి ఆర్ నరేంధర్ రెడ్డి, ప్రిన్సిపల్ చందన, వైస్ ప్రిన్సిపాల్ సోనీ, పిఈటి రాజు, ఉపాధ్యాయులు రజిత, స్పందన, తేజస్విని, శిల్ప, జ్యోతి, రేఖ, మాధవి, శ్రావ్య, గంగమణి, స్రవంతి, రియా, జాబినా, శ్రీతేజ, శ్రీప్రియ, వాణి, ప్రమోద్, విత్యర్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.