12 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

ఆర్మూర్ టౌన్, సెప్టెంబర్ 05 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో పేకాట ఆడుతున్న 12 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు సురేష్ బాబు తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి 90వేల 720 రూపాయలతో పాటు 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ దాడులను ఏసీపీ, టాస్క్ఫోర్స్ ఆదేశాలతో ఇన్స్పెక్టర్ అజయ్ బాబు నేతృత్వంలో జరిగినట్టు ఆయన తెలిపారు. తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడి నిర్వహించామన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.