ఆర్మూర్ క్రైమ్, సెప్టెంబర్ 11 (ప్రజా శంఖారావం):
ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ గ్రామంలో పేకాట ఆడుతున్న 8 మందిని నిజామాబాద్ టాస్క్ఫోర్స్ సిఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పేకాట స్థావరం పై దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుండి 26వేల 900వందల రూపాయలను, 8 సెల్ ఫోన్లను స్వాధీన పరుచుకొని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ కు అప్పచెప్పారు. 8 మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేకాట నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోవడంతోనే యతీచ్చగా పేకాట స్థావరాలు కొనసాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.