ఆర్మూర్ టౌన్, సెప్టెంబర్ 17 (ప్రజా శంఖారావం): హైదరాబాదులోని తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు ఆర్మూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. నియోజకవర్గంలోని ఆలూరు, మాక్లూర్, నందిపేట్, డొంకేశ్వర్ ఆర్మూర్ మండలాల నుండి సుమారు 15 బస్సులు 200 కార్లలో సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. సభ విజయవంతం కావడంపై వినయ్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని ఈ సభను చూస్తే అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమాన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.