చేగుంట, సెప్టెంబర్ 21 (ప్రజా శంఖారావం):
రామయంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసు రెడ్డి గురువారం మధ్యాహ్నం తుడి శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామం. ఆర్ఎస్ వాసిరెడ్డి బిజెపి పార్టీ తరపున 1984లో పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఆయన హయంలో ఎన్నో అభివృద్ధి పనులతో పాటు రోడ్డు మార్గాలను అభివృద్ధి చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి కన్వీనర్ గా పనిచేసిన సమయంలో మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయన మృతిపట్ల పొలంపల్లి గ్రామస్తులతో పాటు చేగుంట మండల ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.