మాక్లూర్, సెప్టెంబర్ 24 (ప్రజా శంఖారావం):
మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో గంగాధర్ గౌడ్ అధ్యక్షతన చరణ్ వడ్ల అధ్వర్యంలో గ్రామానికి చెందిన 100 మంది బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన యూత్ నాయకులు ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో గ్రామ అభివృద్ది కమిటీ అధ్యక్షుడు కలేవర్ రాజు, క్యాషియర్ అవుసలి శ్రీకాంత్, యూత్ నాయకులు విక్రంత్, టీ శ్రీనివాస్, మేర సాయి, రాము, అనిల్, అజయ్, సత్యం, నర్సయ్య, వినీత్, రవి, దుర్గయ్య, మారుతి, జాఫర్, అరుణ్, వివేక్, గౌతం, నిరుప్, ప్రేమ్, శ్రీకాంత్, సతీష్, సన్నీ, బంటి, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత ఎంపీటీసీ వెంకటేశ్వర రావ్, శివకృష్ణ, సత్యనారాయణ, నవీన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.