బొజ్జ గణపయ్య కోసం ఏడ్చిన చిన్నారి

 

నందిపేట్ సెప్టెంబర్ 28 ప్రజా శంఖారావం

నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని ఉమ్మెడ గ్రామంలో ఉమ్మెడ సంగీత మహేష్ ల కూతురు రెండు సంవత్సరాల పాప ఇంట్లో కూర్చోబెట్టిన చిన్న గణపతిని నిమజ్జనం కోసం బయటకి తీసుకు వెళ్తుంటే గణపతి పై ఉన్న మక్కువతో ఏడ్చింది. ఈ సన్నివేశం అక్కడున్న వారిని విస్మయానికి గురి చేసింది. గణపతి పై ఉన్న ప్రేమ చిన్న గణపతి పై పిల్లలకు ఉన్న ఆసక్తిని తెలియజేసే విధంగా ఉన్న ఈ సన్నివేశానికి అక్కడ ఉన్నఅందరూ మంత్రముగ్గులయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతు తెగ చక్కర్లు కొడుతోంది.

Leave A Reply

Your email address will not be published.