ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 05 (ప్రజా శంఖారావం):
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రైమ్ ఆశ ఆసుపత్రిలో జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన మహిళకు గురువారం రొమ్ము క్యాన్సర్ కు శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బాల్ రెడ్డి ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో మొట్ట మొదటిసారిగా కీమో థెరపీ, రొమ్ము క్యాన్సర్ కి సర్జరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అధునాతన పద్ధతులతో హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా పట్టణ కేంద్రంలోని ఆశ ఆసుపత్రిలో చాలా అరుదైన ఆపరేషన్లను నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ అజిజ్ మహమ్మద్ లు తెలిపారు.