* పేకాట ఆడుతున్న 23 మంది అరెస్ట్
* 1,28,950 నగదు స్వాధీనం
ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 06 (ప్రజా శంఖారావం):
ఆర్మూర్ మండలం మంథని, దేగాం గ్రామాలలో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 23 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 1,28,950 నగదును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. మంథని గ్రామంలో రెండు చోట్ల, దేగాం గ్రామంలో ఒకచోట పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ ఎస్సై గంగాధరుడు, కానిస్టేబుళ్లు అనిల్, సుధాకర్, రామచందర్ లు ఉన్నారు.