ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 09 (ప్రజా శంఖారావం):
ఆర్మూర్ పట్టణంలోని రంగాచారి నగర్ కాలనీలో సిద్దాపురం పాపన్న (46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం అర్ధరాత్రి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. మృతునికి భార్య భూదేవితో పాటు ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటన అర్ధరాత్రి రెండు గంటలకు జరిగినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సురేష్ బాబు పరిశీలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.