ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 09 (ప్రజా శంఖారావం)
భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలో ఇండియా వన్ ఎటిఎం లో ఏటీఎం మిషన్ ధ్వంసం చేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. మొదటగా ఏటీఎంలోని సీసీ కెమెరాలకు నల్లటి ఆయిల్ ను చల్లి అనంతరం దుండగులు చోరీకి పాల్పడ్డట్లు తెలుస్తుంది. ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించిన ఏటీఎం కావడంతో ప్రస్తుతానికి ఏటీఎంలో ఎంత మేరకు నగదు దుండగులు దొంగిలించారో పూర్తి వివరాలు తెలియ రాలేదు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.