* నవంబర్ 30న ఎన్నికలు
* డిసెంబర్ 3న కౌంటింగ్
* తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి..
నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 09 (ప్రజా శంఖారావం):
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 3న నామినేషన్ల పర్వం మొదలవుతుందని, 10 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తిరిగి నవంబర్ 13న నామినేషన్ల పరిశీలిన ఉంటుందని చెప్పింది. నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణ తేదీ ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ఖరారు చేసింది. అలాగే దీంతోపాటు నవంబర్ 30న పోలింగ్ నిర్వహిస్తామని, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుకి రానున్నట్లు తెలిపారు.