ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 09 (ప్రజా శంఖారావం):
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారి 63 పై సోమవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా 60 వేల రూపాయల విలువచేసే మద్యాన్ని స్వాధీన పరుచుకున్నట్లు సురేష్ బాబు తెలిపారు. ఎన్నికల సంఘం రానున్న ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాహనాలను తనిఖీ చేయగా మద్యాన్ని స్వాధీన పరుచుకున్నట్లు ఆయన చెప్పారు. వాహనాల తనిఖీల్లో ఎస్సై అంజమ్మ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.