* ఆర్టీసీ బస్సులో కాంగ్రెస్ నాయకుల ప్రచారం
* కాంగ్రెస్ మేనిఫెస్టో పథకాలపై ప్రజలకు వివరణ
* కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో అపూర్వ స్పందన
ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 09 (ప్రజా శంఖారావం):
సామాన్యుడి కోసమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ నితృత్వంలో ఆరు బృహత్తర పథకాలను రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడికి అందే విధంగా రూపొందించినట్లు నిజామాబాద్ జిల్లా మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోర్త రాజేందర్ అన్నారు. సోమవారం ఆర్టీసీ బస్సుల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కరపత్రాలను పంచుతూ ప్రయాణికులకు పార్టీ మేనిఫెస్టో గురించి వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర పాలన పరిస్థితుల గురించి బిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు ప్రవేశపెట్టిన పథకాలను కార్యకర్తలకు తప్ప సామాన్యుని వరకు చేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంతోమంది ఆత్మ బలిదానాలను చూసి కనువిప్పైన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తుందని, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందిస్తామని, ప్రతి మహిళలకు 2వేల 500, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం కింద పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఆయన అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీకి గిఫ్ట్ గా అందజేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.