ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 10 (ప్రజా శంఖారావం):
వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలోని 63జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆంధ్ర బ్యాంక్ ఎటిఎం లో దొంగలు చోరీకి పాల్పడి విఫలయత్నమయ్యారు. ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేసి ఏకంగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో దొంగలించాలని ప్రయత్నం చేశారు. ఏటీఎం మిషన్ తెర్చుకోకపోయేసరికి ఏకంగా పక్కనే ఉన్న గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను ఏటిఎం వద్దకు తీసుకొచ్చి తెల్లవారుజామున 3 గంటలకు తరలించే ప్రయత్నం చేయగా గ్రామస్తులు చూసి వెంబడించడంతో దొంగలు అక్కడి నుండి పరారైనట్లు గ్రామస్తులు తెలిపారు. వరుస ఏటీఎం దొంగతనాలతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది. ఈమధ్య పోచంపాడ్ ఎస్బిఐ ఎటిఎం, రెండు రోజుల క్రితం భీంగల్ ఇండియా 1 ఏటీఎం చోరీ, ఇప్పుడు తాజాగా అంక్సాపూర్ గ్రామంలో ఆంధ్ర బ్యాంకు కు చెందిన ఏటీఎం చోరీకి దొంగలు పాల్పడడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.