ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 10 (ప్రజా శంఖారావం):
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక లక్ష 20వేల నగదు పట్టుబడ్డట్లు ఆర్మూర్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సురేష్ బాబు తెలిపారు. పట్టుబడ్డ నగదుకు సరైన ఆధార పత్రాలు లేనందున జప్తు చేసిన నగదును ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పజెప్పనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున స్థానిక ప్రజలు ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకువెళ్లద్దని ఆయన సూచించారు.