ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 11 (ప్రజా శంఖారావం):
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని విశాఖ కాలనీలో నివాసముంటున్న సిడిపిఓ భార్గవి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డట్లు స్థానికులు తెలిపారు. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజుల క్రితం స్వగ్రామానానికి వారు వెళ్లారని, మంగళవారం రాత్రి తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడి 50వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఇంటి యజమాని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.