ప్రతి గడపలో వినయ్ రెడ్డి ప్రచారం

ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 14 (ప్రజా శంఖారావం):

గడపగడపకు కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని రాజారాం నగర్ కాలనీలో స్థానిక 26, 27 వార్డులలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రతి గడపలో తన ప్రచారాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు పథకాలపై ప్రతి ఇంటింటికీ తిరుగుతూ, కాంగ్రెస్ పథకాలపై వివరిస్తూ తన ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే, ప్రతి పేదవానికి న్యాయం జరగాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారుల ఒడికి చేరాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోల వెంకటేష్, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎట్టెం జీవన్, రేగుల్ల సత్యనారాయణ, మీర్ హైమద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.