చెక్ పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత

సోనాల, అక్టోబర్ 15 (ప్రజా శంఖారావం):

బోత్ మండలంలోని ఘన్ పూర్ చెక్ పోస్ట్ వద్ద ముందస్తుగా వచ్చిన సమాచారంతో ఎక్సైజ్ ఎస్సై లోకానంద్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా మహారాష్ట్ర నుంచి బజార్ హాత్నూర్ మండలంలోని భూతాయి గ్రామానికి చెందిన ముర్కటి నారాయణ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై గంజాయిని తీసుకువస్తుండగా పట్టుకోన్నారు. అతని వద్ద యాబై ఒకటి ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై పేర్కొన్నారు. దీని విలువ 10వేల ఉంటుందని, వ్యక్తిని అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సయిజ్ హెచ్ సీ రమేష్, పోలీసు హెచ్ సీ విఠల్, కానిస్టేబుల్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.