ముందుంది ముసళ్ళ పండగ…అభ్యర్థి ప్రకటనతో కాంగ్రెస్ లో జోష్..

 

ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 15 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడని ఎద్దేవా చేసిన వాళ్లకి ముందుంది ముసళ్ళ పండగ అంటూ హెచ్చరించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుండి మరో లెక్కని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోల వెంకటేష్, మీర్ మాజిద్, మీసాల రవి, బాలకిషన్, పాష, భూపేందర్, జిమ్మీ రవి, రాజు, శ్రీకాంత్, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.