అభివృద్ధికి మంత్రి సహకరించట్లేదు: దుబ్బాక ఎమ్మెల్యే

చేగుంట, అక్టోబర్ 16 (ప్రజా శంఖారావం):

మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు సహకరించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ధ్వజమెత్తారు. చేగుంట మండల కేంద్రంలోని బిజెపి పార్టీ చేరికల  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాడెం వెంగల్ రావు ఎమ్మెల్యే సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి, ఆయనతో పాటు ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేగుంట మండల పరిషత్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయాల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి హరీష్ రావును దుబ్బాక నియోజకవర్గంలోని మెదక్ రోడ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జి కోసం నిధులు మంజూరు చేయమని, అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని అడిగితే కెసిఆర్ కిట్ ల గురించి మాట్లాడుతూ అభివృద్ధి విషయాన్నీ పక్కన పెట్టాడని ఎమ్మెల్యే ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టారని, నరేంద్ర మోడీ పాలనలో ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత దక్కిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కులాల పేరుతో రాజకీయాలు చేస్తూ విభజించి పాలిస్తున్నారని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బందు మండల కేంద్రంలో ఒక్కరికి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గ్రామాల్లో బెల్ట్ షాపులను ఎక్కడపడితే అక్కడ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రానున్న దుబ్బాక ఎన్నికల్లో గతంలో కంటే ఈసారి నాలుగు రెట్ల మెజారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు భూపాల్, మాజీ మండల అధ్యక్షులు పాండు, మాజీ సర్పంచులు బాలచందర్, రఘువీర్రావ్, నాగభూషణం, రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యులు కరణం గణేష్, జ్ఞానేశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంజా గౌడ్, చందాయిపేట మాజీ సర్పంచ్ నాగరాణి నాగేష్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.