మంత్రి వేములను పరామర్శించిన కేటీఆర్

నిజామాబాద్, అక్టోబర్ 17 (ప్రజా శంఖారావం):

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మంగళవారం రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల మంత్రి తల్లి వేముల మంజులమ్మ మృతి చెందిన విషయం విదితమే. ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం మంత్రి కేటీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. ఆయన వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ మధు శేఖర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.