* కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డు పథకాలపై ప్రచారం
* రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాగానే పథకాలు అమలు చేస్తామని వెల్లడి
* హస్తం మీ నేస్తం అంటూ ఇంటింటి ప్రచారం
* లోకల్ బిడ్డను ఆశీర్వదించాలని వినయ్ ప్రచారం
ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 19 (ప్రజా శంఖారావం):
రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోలోని గ్యారెంటీ కార్డు పథకాలపై ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయ్ రెడ్డి ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. లోకల్ బిడ్డనైన తనను ఆశీర్వదించాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్యారంటీ కార్డు పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. అవినీతి రహిత ఆర్మూర్ గా తీర్చిదిద్దడానికి తాను ముందు ఉంటానని, తనతో పాటు కలిసి రావాలని ప్రచారంలో ప్రజలను ఆయన కోరారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ప్రచారానికి వచ్చిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రచారం చేస్తూ ఈనెల 20న రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కార్నర్ మీటింగ్ ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రచారంలో భాగంగా గడపగడపకు కాంగ్రెస్ పథకాలపై వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని దుయ్యబట్టారు. ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని, భారీ మెజారిటీతో తనను ఆశీర్వదించి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఎల్లప్పుడూ హస్తం మీ నేస్తంగా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.